పెళ్లికూతురుగా మలాలా.. పెళ్లికొడుకు పై మొదలైన ట్రోల్స్.. ఇంతకీ ఆయనెవరు ?

by  |
పెళ్లికూతురుగా మలాలా.. పెళ్లికొడుకు పై మొదలైన ట్రోల్స్.. ఇంతకీ ఆయనెవరు ?
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ నోబేల్ శాంతి బహుమతి గ్రహీత ఇప్పుడు శ్రీమతి అయింది. బాలికల విద్య కోసం ఏంతగానో కృషిచేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మలాలా యూసఫ్ జాయ్ ఒక ఇంటి కోడలు గా కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. బ్రిటన్ లోని బర్మింగ్ హౌస్ లో ఇద్దరి కుటుంబసభ్యుల నడుమ తన వివాహాన్ని జరుపుకుంది. ఈ విషయాన్ని మలాలా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. తన భర్త పేరు అన్సర్ అని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది.

తన భర్త అన్సర్ తో కిలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే మలాల వివాహాం చేసుకున్న వ్యక్తి పై పలు రకాల ట్రోల్స్ మొదలయ్యాయి. అతని పేరు అన్సర్ కాదని అతను పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చెందిన హైపెర్ఫార్మెన్స్‌ సెంటర్‌ జనరల్‌ మేనేజర్‌ మాలిక్‌ అని నెటిజన్లు అంటున్నారు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. మలాలా మాత్రం మేము జీవిత భాగస్వాములు కావడానికి అడుగులు వేశాం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒకప్పుడు వివాహం గురించి విముఖంగా మాట్లేడే మలాలా ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో దీని పైన కూడా ట్రోల్స్ బాగానే కనిపిస్తున్నాయి.

రికార్డు ధర పలికిన ప్రముఖ సింగర్ ‘అమీ వైన్‌ హౌస్’ దుస్తులు..


Next Story