తీరంలో అందాల ఆరబోత.. మలైకా ‘బికినీ’ ఫొటో వైరల్

by  |
తీరంలో అందాల ఆరబోత.. మలైకా ‘బికినీ’ ఫొటో వైరల్
X

దిశ, సినిమా : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ యాక్ట్రెస్ మలైకా అరోరా.. తన వర్కవుట్స్‌తో పాటు ఇతర హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా కుర్రకారు మతిపోగొట్టే ఓ బికినీ ఫొటోను ‘సమ్మర్ ఈజ్ హియర్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. క్యాలెండర్ షూట్‌లో భాగంగా ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబు రత్నానీ ఆ ఫొటోను తీసినట్లు పేర్కొంది. ఇక ఈ ఫొటోను చూసి తన బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ హార్ట్ ఎమోజీతో చీర్ చేయడం విశేషం. కాగా మలైకా ఇటీవలే తన యోగాసెషన్స్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు షేర్ చేయగా అవి నెట్టింట అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న ఈ భామ.. అర్జున్ కపూర్‌తో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంది. అయితే తనతో మ్యారేజ్ ఇప్పట్లో ఉండబోదని, తాను ఇలానే హ్యాపీగా ఉన్నానంటూ మలైకా గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

Next Story