- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబైలో ఘోరం.. భవనం కూలి 11మంది దుర్మరణం
<p>దిశ, వెబ్‌డెస్క్: ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం కూలిపోయి అక్కడికక్కడే 11 మంది దుర్మరణం చెందారు. అంతేగాకుండా.. మరో ఎనిమిది మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని న్యూకలెక్టర్ కాంపౌండ్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది మహిళలు, పిల్లలను రక్షించారు. భవనం కుప్పకూలిపోవడంతో సమీపంలో అధికారులు అప్రమత్తమై మరికొన్ని భవనాలలోని ప్రజలను ఖాళీ చేయించి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనం కూలిపోయి అక్కడికక్కడే 11 మంది దుర్మరణం చెందారు. అంతేగాకుండా.. మరో ఎనిమిది మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని న్యూకలెక్టర్ కాంపౌండ్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది మహిళలు, పిల్లలను రక్షించారు. భవనం కుప్పకూలిపోవడంతో సమీపంలో అధికారులు అప్రమత్తమై మరికొన్ని భవనాలలోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి అస్లాం షేక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… “వర్షం కారణంగా భవనాలు కూలిపోయాయని, సహాయక చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యసేవలు అందిచాలని వైద్యాధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.






