సాయం చేయండి.. మంత్రి వేములకు ఎమ్మెల్యే విన్నపం

by Shyam |

<p>దిశ, మహబూబ్ నగర్ : అడ్డాకుల మండలం వర్నే, భూత్పూర్ మండలం ముత్యాలపల్లి దగ్గర బ్రిడ్జిలు లేక ఆయా ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన బ్రిడ్జీలు, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఈ రెండు గ్రామాలతోపాటు, ఇతర గ్రామాల ప్రజలు సైతం ఈ ప్రాంతం గుండా రాకపోకలు [&hellip;]</p>

minister vemula prasanth
X

దిశ, మహబూబ్ నగర్ : అడ్డాకుల మండలం వర్నే, భూత్పూర్ మండలం ముత్యాలపల్లి దగ్గర బ్రిడ్జిలు లేక ఆయా ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన బ్రిడ్జీలు, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ఈ రెండు గ్రామాలతోపాటు, ఇతర గ్రామాల ప్రజలు సైతం ఈ ప్రాంతం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజల అవసరాల మేరకు నీళ్లు వేసినప్పటికీ వర్షాకాలంలో నీటి తాకిడికి కొట్టుకుపోతుందని ఎమ్మెల్యే, మంత్రికి తెలిపారు.

రాకపోకలు నిలిచిపోయాయి ప్రజలు 30 కిలోమీటర్లు పై నుంచి గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వస్తుందని ఆయన వివరించారు. తన విన్నపానికి మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story