కేసీఆర్‌‌ను తిడితే నాలుక కోస్తాం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

183

దిశ, మక్తల్: తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొందరు నాయకులు పనిగట్టుకుని తిడుతున్నారని.. ఆ నాయకుల నాలుకలను కోస్తామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి కేసీఆర్‌ను వ్యంగ్య పదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు ఎవరూ సహించరని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం ఉన్నత పదవుల్లో ఉన్న వారిని విమర్శించడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, అమర్ మార్కెట్ చైర్మన్, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..