పవన్ అభిమానులకు గుడ్ న్యూస్.. మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్న మేకర్స్

by  |
పవన్ అభిమానులకు గుడ్ న్యూస్..  మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్న మేకర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సెట్స్ లో అడుగుపెట్టారు. ప్రస్తుతం పవన్ , రానా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ధ్రువీకరిస్తూ పవన్ పోలీస్ గెటప్ లో ఉన్న ఫోటోను రిలీజ్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. షూటింగ్ మొదటి నుంచే హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం పవన్ ఫోటో, పేరు రివీల్ అవ్వడంతో అభిమానులు పండగ మొదలుపెట్టేశారు.

https://twitter.com/baraju_SuperHit/status/1419904365746290698?s=20

ఇక మేకర్స్ సైతం ఈ సినిమా పై రోజురోజుకు అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో ను ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పవన్ అభిమానులు ట్విట్టర్ ట్రెండింగ్ స్టార్ట్ చేశారు. అన్న వస్తున్నాడు.. అంటూ పోస్ట్ లు, కామెంట్లు చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Next Story

Most Viewed