‘ఆచార్య’ బిగ్గెస్ట్ సెట్

by  |
‘ఆచార్య’ బిగ్గెస్ట్ సెట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కోసం మెగాఫ్యాన్స్ వెయిటింగ్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాక అంచనాలకు అంతులేకుండా పోయింది. పైగా సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అప్పియరెన్స్ మరింత స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేసింది. దీంతో డైరెక్టర్ కొరటాల ఫిల్మ్ మేకింగ్‌లో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో భారీ సెట్ వేస్తున్నారట. రూ.20 కోట్ల ఖర్చుతో 16 ఎకరాల్లో సెట్ డిజైన్ చేస్తుండగా..ఈ సినిమా కోసం ప్లాన్ చేసిన సెట్స్‌లో ఇది రెండోది. మోషన్ పోస్టర్‌లో కనిపించిన గుడి ఫస్ట్ సెట్ కాగా ఇందుకోసం రూ.నాలుగు కోట్లు ఖర్చయింది.

దేవాదాయ శాఖలో అవినీతిని బట్టబయలు చేయడమే సినిమా కథ. చిరు, చరణ్ నక్సలైట్స్‌గా కనిపించబోతున్నారు. మెగాస్టార్‌కు జోడీగా అందాల చందమామ కాజల్.. చెర్రీకి జోడీగా కన్నడ బ్యూటీ రష్మిక మందనను ఫైనల్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Next Story