‘చాయ్‌’లో జిన్ కలుపుతున్న నిర్వాహకులు.. ఎక్కడో తెలుసా..?

by Shyam |   (  Updated:2021-07-06 07:06:10  IST  )

<p>దిశ, ఫీచర్స్ : మన ఇంటికి ఎవరొచ్చిన ‘టీ’ అందించడం ఒక సంప్రదాయం. నలుగురు స్నేహితులు కలిసి హోటల్లో ‘తేనీరు’ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ఓ సరదా.. ఉదయాన్నే ఒక్క సిప్ ‘చాయ్’తో నిద్రాణమైన మెదడు ఉత్తేజితమవుతుంది. పని ఒత్తిడిలోనూ ఒక కప్పు టీ ఎంతో రిలీఫ్‌నెస్ ఇస్తుంది. అలాగే వైన్ తాగినపుడు మత్తు దిగకపోతే స్ట్రాంగ్ టీ లాగించేస్తారు. మరి టీ+జిన్ కలిపి సేవిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఢిల్లీలోని ఓ బార్ నిర్వాహాకులు మాత్రం [&hellip;]</p>

makaibari-Tea
X

దిశ, ఫీచర్స్ : మన ఇంటికి ఎవరొచ్చిన ‘టీ’ అందించడం ఒక సంప్రదాయం. నలుగురు స్నేహితులు కలిసి హోటల్లో ‘తేనీరు’ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం ఓ సరదా.. ఉదయాన్నే ఒక్క సిప్ ‘చాయ్’తో నిద్రాణమైన మెదడు ఉత్తేజితమవుతుంది. పని ఒత్తిడిలోనూ ఒక కప్పు టీ ఎంతో రిలీఫ్‌నెస్ ఇస్తుంది. అలాగే వైన్ తాగినపుడు మత్తు దిగకపోతే స్ట్రాంగ్ టీ లాగించేస్తారు. మరి టీ+జిన్ కలిపి సేవిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఢిల్లీలోని ఓ బార్ నిర్వాహాకులు మాత్రం అదిరిపోతుంది అంటున్నారు. ఇంతకీ ఆ టీ ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? దాని ప్రత్యేకతలేంటో చూద్దాం..

జూలై 12 నుంచి న్యూ ఢిల్లీ ‘సైడ్‌కార్ కాక్‌టెయిల్ బార్‌’లోని మెనూలో డార్జిలింగ్‌‌ ఫేమస్ ‘మకైబారి టీ’ని చేర్చనున్నారు. “సైడ్‌కార్ ఎక్స్ మకైబారి – ఎ సమ్మర్ సొల్స్‌టైస్’ అని పిలిచే ఈ చాయ్‌లో జిన్ ఆల్కహాల్ కలుపుతారు. ఈ స్పెషల్ కాక్‌టెయిల్ రూపొందించడానికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుందని.. అంతర్జాతీయస్థాయిలో కాక్‌టెయిల్ మిశ్రమాలపై రచనలు అందించే లామా, ప్రపంచంలోని 100 ఉత్తమ కాక్టె‌యిల్ బార్లలో ఒకటైన సైడ్‌కార్‌తో జతకట్టి, ఈ ప్రత్యేక పానీయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇండియాలోని టీ గార్డెన్, బార్ మధ్య జరిగిన తొలి ఒప్పందంతో ఆరు కొత్తరకాల కాక్‌టెయిల్స్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. అంతేకాదు మకైబరితో పాటు కాక్‌టెయిల్స్ మెజర్ ఆఫ్ సబ్‌స్టాన్స్, అగోనీ ఆఫ్ ది లీవ్స్, హిమాలయన్ టీ టికి, సమ్మర్ సొల్స్‌టైస్ హైబాల్, డార్జిలింగ్ మెయిల్ ఈ జాబితాలో ఉన్నాయి. 60మి.లీ ‘మకైబారి – ఎ సమ్మర్ సొల్స్‌టైస్ ఇన్‌ఫ్యూజ్డ్ జిన్‌’ కాక్‌టెయిల్‌లో 20 మి.లీ రోడోడెండ్రాన్ బ్లాంక్‌తో పాటు, లెమన్ పీల్స్ ఆయిల్స్, ఎడిబుల్ ఫ్లవర్స్ ఉంటాయి. కాక్‌టెయిల్ ధర 575 రూపాయలకు పైగా ఉంటుంది. అయితే వినియోగదారులకు కాక్‌టెయిల్ రెసిపీని కూడా అందిస్తామని బార్ నిర్వాహకులు చెబుతున్నారు.

1859లో కలకత్తాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరై వద్ద ఓ జమీందార్ కుటుంబీకుడు గిరీష్ చంద్ర బెనర్జీ మకైబారిని పెంచడం ప్రారంభించారు. ప్రస్తుతం 573 హెక్టార్లలో ఉన్న ఈ టీ తోటలో 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 2015లో క్వీన్ ఎలిజబెత్‌కు ఈ మకైబరీ చాయ్‌ను ఆఫర్ చేశారు. ఇక 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలోనూ, బ్రెజిల్‌లో జరిగిన 2014 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలోనూ అందించారు.

భారతదేశానికి అమెరికన్ విస్కీ రాయబారిగా డిస్టిల్డ్ స్పిరిట్స్ కౌన్సిల్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్, ఇండియా అటాచ్ టేల్స్ ఆఫ్ ది కాక్టెయిల్స్ (న్యూ ఓర్లీన్స్)లు లామాను నియమించారు. అతను తాజ్ లగ్జరీ, ఐటిసి, ది ఒబెరాయ్, పార్క్ హోటల్స్ వంటి భారతదేశంలోని అగ్ర హోటళ్ళ చైన్స్‌కు ఆల్కహాల్ ట్రెయినర్‌గా కొనసాగుతున్నాడు.

Next Story