- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లమల అడవుల్లో మంటలు.. కారణం ఎవరు..?
<p>దిశ, అచ్చంపేట : నల్లమల అడవుల్లో వేసవికాలం ప్రారంభం దశలోనే వరుస అగ్నిప్రమాదాలు అందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 20 రోజుల్లో ఇప్పటికే ఐదుసార్లు అడవి అగ్నికి ఆహుతి అవుతూనే ఉన్నది. ఇటీవల అడవుల్లో చెలరేగిన మంటల్లో 11 మంది చెంచులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఉస్మానియాలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయారు. మషుషులే తీవ్రంగా గాయపడితే జంతువుల పరిస్థితిని అంచనా వేయొచ్చు. మంటలు వ్యాపించకుండా ఫైర్ లైన్లు, వ్యూలైన్ల లాంటివి ఏర్పాటు చేసినా మంటలు […]</p>

దిశ, అచ్చంపేట : నల్లమల అడవుల్లో వేసవికాలం ప్రారంభం దశలోనే వరుస అగ్నిప్రమాదాలు అందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 20 రోజుల్లో ఇప్పటికే ఐదుసార్లు అడవి అగ్నికి ఆహుతి అవుతూనే ఉన్నది. ఇటీవల అడవుల్లో చెలరేగిన మంటల్లో 11 మంది చెంచులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఉస్మానియాలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయారు. మషుషులే తీవ్రంగా గాయపడితే జంతువుల పరిస్థితిని అంచనా వేయొచ్చు. మంటలు వ్యాపించకుండా ఫైర్ లైన్లు, వ్యూలైన్ల లాంటివి ఏర్పాటు చేసినా మంటలు చెలరేగినప్పుడల్లా వాటిని నియంత్రించినా ఎక్కడో మూల అగ్నిప్రమాదాలు జరగడం కలవరపెడుతోంది. కాగా, మానవ తప్పిదాలతోనే అడవుల్లో మంటలకు కారణమని అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు. స్థానికులు సహా పర్యాటకుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఆందోళన కలిగిస్తున్న అగ్ని ప్రమాదాలు..
నల్లమల అడవుల్లో నిత్యం జరుగుతున్న అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో 5కు పైగా జరిగిన ప్రమాద సంఘటనలు అటవీ ప్రాంతం 2.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నది వేసవికాలం ప్రారంభం నుంచి ఇంత పెద్ద అడవి ప్రాంతం ఏదో ఒక మూలన అగ్నికి ఆహుతి అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో అడవుల్లో ఎంత తీవ్రతకు దాపురించి ఉందో అద్దం పడుతున్నాయి.
ఎక్కడెక్కడ ప్రమాదాలు..
వేసవి కాలం ప్రారంభం దశ నుంచి ఏజెన్సీ ప్రాంతమైన జిల్లాలోని అమ్రాబాద్ లింగాల మండల పరిధిలో ఫిబ్రవరి 4న వట్వర్లపల్లిలో, ఫిబ్రవరి 14న పదర మండలం లక్ష్మాపూర్ సమీపంలోని చెన్నంపల్లిలో.. మార్చి 1న అక్టోపస్ వ్యూపాయింట్ సమీపంలో, మల్లాపూర్ చెంచు పెంటల సమీపంలో, 9న మల్లాపూర్, రోళ్లబండ పెంటల సమీపంలో నల్లమల అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాగా, మల్లాపూర్ పెంట సమీపంలో మంటలు అంటుకున్న ఘటనలో 11 మంది చెంచులు తీవ్రంగా గాయపడగా వారిని హైదరాబాద్, మహబూబ్ నగర్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి శనివారం ప్రాణాలు కోల్పోయారు. మార్చి 12న అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని కొల్లంపేట సమీపంలోనూ మంటలు అంటుకున్నాయి. ఇలా వరుస అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మల్లాపూర్ పెంట సమీపంలోగల చెలరేగిన మంటలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. అటవీ శాఖ వెబ్సైట్ టీజీఎఫ్ఎమ్ఐఎస్ గణాంకాల ప్రకారం నాగర్ కర్నూల్ జిల్లాలో 987 ఫైర్ అలెర్ట్లు రాగా 2, 669 హెక్టార్ల అడవి మంటల బారిన పడింది అధికారులు అంచనా వేశారు
నల్లమల అటవీ ప్రాంతం సుమారు రెండున్నర లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంటుంది. ఇందులో లక్షా 75వేల హెక్టార్లు పులుల అభయారణ్యం. చెట్లరాపిడి వల్ల నిప్పు పుట్టేంత పెద్దవృక్షాలు నల్లమల అడవుల్లో లేవని అధికారులంటున్నారు. ఎవరైనా నిప్పు రవ్వల్ని వదిలితేనే గడ్డి అంటుకుని, వేగంగా ఇతర ప్రాంతాలకు మంటలు విస్తరిస్తున్నాయని అధికారులు అంటున్నారు. అడవుల్లో మంటలు విస్తరించకుండా అధికారులు ఫైర్ లైన్లు ఏర్పాటు చేస్తారు. అడవిలోని రోడ్డు మార్గానికి ఇరువైపుల సుమారు 10 మీటర్ల దూరం వరకూ పూర్తిగా గడ్డి, పొదలు లేకుండా చేస్తారు. ఆయా మార్గాల గుండా వెళ్లే ప్రయాణికులు రోడ్డుపక్కన నిప్పురవ్వలు పడేసినా అవి ఇతర ప్రాంతాలకు విస్తరించవు. ఇక అడవుల మధ్యలో ఐదారు మీటర్ల వెడల్పుతో గడ్డి లేకుండా బాటల్లా ఫైర్ లైన్లు ఏర్పాటు చేస్తారు. ఒక ప్రాంతంలో మంటలు అంటుకున్నా మరో ప్రాంతానికి విస్తరించకుండా ఫైర్ లైన్లు అడ్డుకుంటాయి. అలా ఎన్ని ఏర్పాట్లు చేసినా మంటలు అంటుకోవడం ప్రశ్నార్థకంగా మారింది.
మంటలు అంటుకున్నా వాటిని ఆర్పేందుకు నల్లమలలో 6 తక్షణ స్పందన బృందాలున్నాయి. వీరితో పాటు బీట్ అధికారులు, రేంజ్ అధికారులు ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటారు. పచ్చికొమ్మలు, బ్లోయర్లు, ఇతర అధునాతన యంత్రాలతో సిబ్బంది మంటల్ని నియంత్రిస్తున్నారు. కాని నల్లమల అడవుల్లో ఎత్తైన గుట్టలు, లోతైన లోయల్లాంటి ప్రాంతాలున్నాయి. అలాంటి ప్రాంతాల్లో మంటలు అంటుకుంటే వెళ్లడం కష్టంగా మారుతోంది. అక్కడే నష్టం అధికంగా ఉంటోంది. ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుని అడవుల్లో నివసించే చెంచులు, ఇతర ఆవాస గ్రామాల ప్రజలకు, ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నామంటున్నారు.
మనుగడ ప్రశ్నార్థకం..
జంతుజాలం మనుగడ, నల్లమలలో జరిగే వరుస ప్రమాదాల కారణంగా అరుదైన వృక్ష సంపద అగ్నికి అహుతి కావడమే కాకుండా జంతుజాలం మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి, అవసరమైతే అధిక నిధులు వెచ్చించి నల్లమలలో అగ్ని ప్రమాదాలను నియంత్రించాలని అటవీ ప్రేమికులు కోరుతున్నారు. అడవుల్లో ఉన్న విలువైన సంపదను కొల్లగొట్టేందుకు కుట్రలు విస్తారమైన ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను నిర్వీర్యం చేస్తూ ఒక కుట్రపూరితంగానే అడవుల్లో మంటల వ్యాప్తి పెరుగుతోందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మయ్య, రాష్ట్ర భూ పరిరక్షణ సమితి నాయకుడు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఇతర ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆదివాసీలను అడవి నుంచి పంపిచడానికి ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని అంటున్నారు. అటవీశాఖ అధికారులు మానవ తప్పిదాలే మూలంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నివారణ చర్యలు చేపడుతున్నాం…
నల్లమల అటవీ ప్రాంతంలో ప్రస్తుతం కొంత విపత్కర సమస్యలు నెలకొన్నాయని, ముఖ్యంగా మల్లాపూర్ పెంటకు చెందిన గిరిజనులు మంటల్లో చిక్కుకొని గాయాల పాలై అందులో ఒకరు మరణించడం విషాదకరమని జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన దిశతో ఫోన్లో మాట్లాడారు. దేశ చరిత్రలోనే అడవిలో ఆదివాసులు మంటల్లో చిక్కుకొని ప్రమాదానికి గురికావడం ఇది మొదటి ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు.
అడవుల్లో మంటలను నివారించేందుకు హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి ఇరుపక్కల, రిజర్వు అడవుల్లో 12 కిలోమీటర్లు 5 మీటర్ల వెడల్పుతో ఎయిర్ లైన్ లో ఏర్పాటు చేశామని, ఆరు రిస్కు టీవీలను నియమించామని, ఐదు వాచ్ టవర్లు ఏర్పాటు చేశామని, అమ్రాబాద్, లింగాల్, మన్ననూర్ రేంజ్ పరిధిలో రెండు వందల కిలోమీటర్లు పొడవున అంతర్గత రోడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కృష్ణ గౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి






