న్యూ లుక్‌లో మహేశ్, నారా రోహిత్

by  |
న్యూ లుక్‌లో మహేశ్, నారా రోహిత్
X

దిశ, వెబ్ డెస్క్: క్వారంటైన్ టైమ్‌ను సెలబ్రెటీలంతా చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. తమ రాబోయే సినిమాల్లో సరికొత్త లుక్‌లో కనిపించేందుకు ట్రై చేస్తున్నారు. కొంతమంది తమ ఫిట్‌నెస్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే, మరికొంత మంది డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, బియర్డ్ సైల్స్‌తో దర్శనమిస్తున్నారు.

ఇక లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మహేశ్.. పిల్లలు సితార, గౌతమ్‌లతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే సితార పాప కోసం మహేశ్‌ ఓ పాట పాడుతూ నవ్వించిన వీడియో సూపర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా గౌతమ్‌, సితారలతో కలిసి మహేశ్‌ దిగిన ఓ సెల్ఫీని నమ్రత షేర్‌ చేశారు. ఈ ఫోటోలో చాలా క్యూట్‌గా, ‘లవర్ బాయ్’లా కనిపిస్తున్న మహేశ్.. ఫ్యాన్స్‌ను ‘క్లీన్’ బౌల్డ్ చేస్తున్నారు. క్లీన్ షేవ్, పెద్ద కళ్ల జోడుతో పాటు హెయిర్ స్టైల్ కూడా చాలా కొత్తగా ఉంది. పరశురామ్ తెరకెక్కించనున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మహేశ్ ప్లే బాయ్‌గా కనిపించనున్నాడని సమాచారం. మరి అందులో రొమాంటిక్‌గా కనిపించేందుకు ఈ లుక్ ట్రై చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న హీరో నారా రోహిత్.. ఇటీవలే ట్విట్టర్ ఎంట్రీ ఇస్తూ పోలీస్ ఆఫీసర్ స్టైల్‌లోమంచి ఫిట్‌నెస్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసి అభిమానులను ఫిదా చేశారు. తాజాగా న్యూ లుక్‌తో ఉన్న మరో ఫోటోను కూడా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ ఫోటోలో ఆయన క్లీన్ షేవ్‌తో చాలా కూల్‌గా కనిపించారు. మరి ఈ న్యూ లుక్‌ కొత్త సినిమా కోసం ట్రై చేశారా లేక సరదాగానే అలా రెడీ అయ్యారా మాత్రం తెలియాల్సి ఉంది. ఏదేమైనా రోహిత్ న్యూ లుక్‌లో స్టూడెంట్‌లా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోల లుక్ సిమిలర్‌గా ఉండటం విశేషం.


Next Story