నిస్వార్థ సేవకులను గౌరవిద్దాం : మహేష్ బాబు

by  |
నిస్వార్థ సేవకులను గౌరవిద్దాం : మహేష్ బాబు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు వైద్యులను గౌరవించుకుందామని పిలుపునిస్తున్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మనల్ని సురక్షితంగా ఉంచేందుకు నిర్విరామంగా, నిస్వార్థంగా సేవలందిస్తున్న డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. వారి ప్రాణాలను ప్రమాదంలో పెట్టి, ప్రేమించే వాళ్ళను వదిలేసి… యుద్ధ భూమిలోకి అడుగుపెడుతున్నరు … ఇదంతా చేస్తుంది మనల్ని కాపాడుకునేందుకే అని అర్థం చేసుకోవాలన్నారు. మనని రక్షిస్తున్న వైద్యులు కూడా రక్షించబడాలన్న మహేష్… వారి త్యాగాలను గుర్తించి కృతజ్ఞతలు తెలుపుకుందాం అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒకరికొకరు ఇచ్చుకునే గొప్ప బహుమతి… ప్రేమ, సానుభూతి మాత్రమే అన్నారు మహేష్. నేను ప్రతీ ఒక్కరినీ కోరేది ఒక్కటే… మన మెడికల్ వర్కర్స్ పట్ల దయగా, మర్యాదపూర్వకంగా ఉందాం. మన నిజమైన సూపర్ హీరోలను గౌరవిద్దాం.

కాగా మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పగా… లాక్ డౌన్ ఎత్తేయగానే షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ ను తీసుకుంటున్నట్లు సమాచారం.

Tags: Mahesh Babu, Medical Workers, Doctors, Corona, Covid19

Next Story

Most Viewed