- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్రెస్టింగ్ గా మహేష్ స్ట్రీమింగ్ యాప్ పేరు
<p>రెండు పడవల మీద ప్రయాణం ప్రమాదకరం అంటుంటారు… కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందుకు అతీతుడు అనిపిస్తుంది. సినిమాల్లో సూపర్ స్టార్ గా సరిలేరు నీకెవ్వరు అని రుజువు చేసుకుంటూనే… బిజినెస్ మెన్ గా రాణిస్తున్నాడు ప్రిన్స్. భార్య నమ్రత శిరోద్కర్ సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతుందని చెప్తుంటారు. ఇప్పటికే హైదరాబాద్ ఏఎంబి సినిమాస్ నెలకొల్పి సక్సెస్ అయిన మహేష్… బెంగళూరు, వైజాగ్, విజయనగరం లోనూ ఏఎంబి సినిమాస్ నెలకొల్పేందుకు ట్రై చేస్తున్నాడు. అంతే కాదు ది […]</p>

రెండు పడవల మీద ప్రయాణం ప్రమాదకరం అంటుంటారు… కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందుకు అతీతుడు అనిపిస్తుంది. సినిమాల్లో సూపర్ స్టార్ గా సరిలేరు నీకెవ్వరు అని రుజువు చేసుకుంటూనే… బిజినెస్ మెన్ గా రాణిస్తున్నాడు ప్రిన్స్. భార్య నమ్రత శిరోద్కర్ సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతుందని చెప్తుంటారు. ఇప్పటికే హైదరాబాద్ ఏఎంబి సినిమాస్ నెలకొల్పి సక్సెస్ అయిన మహేష్… బెంగళూరు, వైజాగ్, విజయనగరం లోనూ ఏఎంబి సినిమాస్ నెలకొల్పేందుకు ట్రై చేస్తున్నాడు. అంతే కాదు ది హంబుల్ అనే ఓన్ క్లాత్ బ్రాండ్ లాంచ్ చేసి అందులోనూ సక్సెస్ అయ్యాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు బిజినెస్ మెన్ గా మరో అడుగు వేయబోతున్నాడు మహేష్. డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. Amazon prime, Netflix, Aha మాదిరిగా డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ను లాంచ్ చేసే పనిలో ఉన్నాడు. దీనికి # SIGMA.. అనే పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. సితార, గౌతమ్, మహేష్ బాబు పేర్లు కలిసి వచ్చేలా యాప్ కు ఈ పేరును ఎంచుకున్నారట. కృష్ణ పుట్టినరోజున మే 31న లాంచ్ ఉంటుందని సమాచారం.
Tags : Mahesh Babu, Streaming App, Business, Tollywood






