అడవి శేషుకు సూపర్ స్టార్ కానుక

by  |
అడవి శేషుకు సూపర్ స్టార్ కానుక
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో అడవి శేషుకు దీపావళి గిఫ్ట్ వచ్చేసింది. ఒక్కరోజు ముందుగానే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అండ్ ఫ్యామిలీ నుంచి బహుమతి అందుకున్నారు. అడవి శేషు హీరోగా వస్తున్న ‘మేజర్’ సినిమాకు మహేశ్ నిర్మాత. మూవీ యూనిట్ మొత్తానికి దివాళీ కానుకలు పంపించారు మహేశ్. ఈ గిఫ్ట్ షేర్ చేస్తూ థాంక్స్ చెప్పాడు శేషు.

‘మేజర్’ మూవీ ఉన్ని‌కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ సినిమాకు శశి కిరణ్ దర్శకులు. శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్ రైటర్‌గా పని చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో సినిమా రిలీజ్ అవుతుండగా జీఎంబీ సినిమాస్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Next Story

Most Viewed