ఫ్లాప్ సినిమాల వల్లే ఇలా తయారయ్యానంటున్న స్టార్ హీరో

447

దిశ, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరియర్‌ పరిశీలిస్తే.. స్టార్‌డమ్ ఊరికే రాలేదనే విషయం అర్థమవుతుంది. సినిమా సినిమాకు తనలోని నటుడు పరిణతి చెందుతూనే ఉండగా, కథలు ఎంచుకునే విధానంలోనూ చాలా మార్పు కనబడుతోంది. అయితే ఇదంతా ఒక్కరోజులో సాధ్యం కాలేదని, తప్పుల నుంచి నేర్చుకున్న గుణపాఠాలే రాటుదేలేలా చేశాయని రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మహేశ్. ‘ఒక సినిమా బాగా ఆడకపోతే బాధిస్తుంది. ఈ మధ్యకాలంలో సక్సెస్ శాతం పెరిగినా అంతకుముందు అలా లేదు. స్పైడర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లవచ్చు కానీ, అది చాలామంది జీవితాలను ప్రమాదంలో పడేస్తుంది. ఎందుకంటే సినిమా అంటే నేను ఒక్కడినే కాదు. దీని వెనుక పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ఉంటారు. ఇప్పుడు సినిమా బడ్జెట్‌‌లు కూడా రూ. 200 కోట్ల వరకు పెరిగాయి’ అని చెప్పుకొచ్చాడు.

మహేశ్ తన సక్సెస్‌ఫుల్ కెరియర్ గురించి మాట్లాడుతూ.. ఇది నిజంగా అదృష్టమేనని, కానీ పెరుగుతున్న అంచనాలను మ్యాచ్ చేయడం మాత్రం సవాల్‌గా పేర్కొన్నారు. ఇక కెరీర్ ప్రారంభం నుంచి సినిమా స్క్రిప్ట్‌లను తానే సొంతంగా ఎంచుకుంటానన్న ప్రిన్స్.. సైన్ చేసిన సినిమాల గురించి వైఫ్‌తో కూడా చర్చించనని తెలిపాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..