- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మా.. మీ పోరాటానికి సెల్యూట్ : మహేష్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు దేశాన్ని సంబరాల్లో మునిగేలా చేసింది. నిర్భయ తల్లి ఆశాదేవి చేసిన పోరాటం.. మొక్కవోని ధైర్యం దోషులను ఉరికంబానికి ఎక్కించగా… దేశంలో ఇంకా న్యాయం మిగిలి ఉందనే నమ్మకాన్ని నిలబెట్టింది. నాడు విలవిల్లాడి రగిలిపోయిన తల్లి గుండె కాస్త శాంతించగా… ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం పోరాటం చేయాలన్న పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నిర్భయ కేసుపై స్పందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. న్యాయం కోసం నిరంతర […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలు దేశాన్ని సంబరాల్లో మునిగేలా చేసింది. నిర్భయ తల్లి ఆశాదేవి చేసిన పోరాటం.. మొక్కవోని ధైర్యం దోషులను ఉరికంబానికి ఎక్కించగా… దేశంలో ఇంకా న్యాయం మిగిలి ఉందనే నమ్మకాన్ని నిలబెట్టింది. నాడు విలవిల్లాడి రగిలిపోయిన తల్లి గుండె కాస్త శాంతించగా… ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం పోరాటం చేయాలన్న పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నిర్భయ కేసుపై స్పందించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. న్యాయం కోసం నిరంతర పోరాటం చేసిన నిర్భయ తల్లిదండ్రులు, లాయర్లకు సెల్యూట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్ననిర్భయ కేసులో నేడు న్యాయం జరిగిందన్నారు. తద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించిదని అన్నారు.
tags : Mahesh Babu, Superstar Mahesh, Nirbhaya, Nirbhaya Verdict
Next Story






