తన బోల్డ్ సీన్స్‌ను ఆయన చూడలేరు : హీరోయిన్ తల్లి

by  |
తన బోల్డ్ సీన్స్‌ను ఆయన చూడలేరు : హీరోయిన్ తల్లి
X

దిశ, సినిమా : సంజయ్ కపూర్, మహిమా కపూర్‌ల కూతురు షనయ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ తనను బీటౌన్‌కు పరిచయం చేస్తుండగా.. ఈ విషయం తెలిసినప్పటి నుంచి షనయ ఫస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో షనయ తల్లి మహిమా కపూర్ ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతురి డెబ్యూ మూవీకి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. కాగా ఈ మూవీలో షనయ నటించిన కిస్సింగ్, ఇంటిమేట్ సీన్స్‌ను చూస్తే సంజయ్ కపూర్ ఎలా రియాక్ట్ అవుతారని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు డిఫరెంట్‌ ఆన్సర్ ఇచ్చింది మహిమ. సినిమాలో అలాంటి సీన్లను చూసి మొదట సంజయ్ ఆశ్చర్యపోయినా, కూతురి వర్క్ విషయంలో మాత్రం జోక్యం చేసుకోడని తెలిపింది. కానీ లోపల మాత్రం ‘ఓ మై గాడ్.. నేనేం చూస్తున్నాను’ అని అనుకున్నా, అది ప్రొఫెషన్ అని అర్థం చేసుకుంటాడని చెప్పుకొచ్చింది. కాగా సంజయ్ కపూర్ తన కూతురి విషయంలో ఎంత కేరింగ్‌గా ఉంటారో.. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన రియాలిటీ షో ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్’ చూపించింది.


Next Story

Most Viewed