మోడీతో ఉద్ధవ్ భేటీ

by  |
మోడీతో ఉద్ధవ్ భేటీ
X

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, అతని కొడుకు.. క్యాబినెట్ మినిస్టర్ ఆదిత్య ఠాక్రేలు భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక ఉద్ధవ్ ఠాక్రే.. పీఎంతో భేటీ కావడం ఇది రెండోసారి. భేటీ మొదలయ్యాక మోడీ కార్యాలయం, ఉద్ధవ్ ఠాక్రే ట్విట్టర్ హ్యాండిళ్లలో మర్యాదపూర్వకంగా జరుగుతున్న భేటీ ఫొటోలు పోస్టు అయ్యాయి. ఢిల్లీకి వెళ్లిన ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలు తర్వాత కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అడ్వాణీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కాబోతున్నారు.

భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధానితో చర్చలు ఫలప్రదంగా సాగాయని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ప్రధానితో సీఏఏపై చర్చించామని అన్నారు. ఎన్‌పీఆర్ గురించి ఆందోళన పడాల్సిందేమీ లేదని మోడీ తెలిపారని వివరించారు. దేశవ్యాప్త ఎన్ఆర్‌సీ ఉండబోదని చెప్పారని పేర్కొన్నారు. అలాగే, మిత్ర పక్షాలతో ఎటువంటి సమస్యా లేదని స్పష్టం చేశారు.



Next Story