- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రలో ఒకేరోజు 391 మంది మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ… విలయతాండవం చేస్తోంది. గత నాలుగైదు రోజుల నుంచి ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం కొత్తగా 22,084 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,37,765కు చేరింది. అందులో 7,28,512 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతూ… విలయతాండవం చేస్తోంది. గత నాలుగైదు రోజుల నుంచి ప్రతిరోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం కొత్తగా 22,084 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,37,765కు చేరింది. అందులో 7,28,512 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 2,79,768 యాక్టివ్ కేసులున్నాయి. శనివారం ఒకే రోజు రాష్ట్రంలో కరోనా మూలంగా 391 మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,887కు చేరింది. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది.
Next Story






