బాబ్లీ గేట్ ఎత్తిన మహారాష్ట్ర

by Shyam |

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మహారాష్ట్రలోనీ నాందేడ్ జిల్లాలో గోదావరి నది పైన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్ ను మహారాష్ట్ర అధికారులు ఎత్తినట్టు ఎస్ఆర్ఎస్‌పీ ప్రాజెక్ట్ అధికారులకు సమాచారం అందించారు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఉన్న అంతరాష్ట్ర నది జలాల ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది జులై నెలలలో బాబ్లీ గేట్లు ఎత్తి శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లోకి నీళ్లు వదలడం ఆనవాయితీ. కానీ మహారాష్ట్ర లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం బాబ్లీ [&hellip;]</p>

babli project gates open
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మహారాష్ట్రలోనీ నాందేడ్ జిల్లాలో గోదావరి నది పైన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్ ను మహారాష్ట్ర అధికారులు ఎత్తినట్టు ఎస్ఆర్ఎస్‌పీ ప్రాజెక్ట్ అధికారులకు సమాచారం అందించారు. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఉన్న అంతరాష్ట్ర నది జలాల ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది జులై నెలలలో బాబ్లీ గేట్లు ఎత్తి శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లోకి నీళ్లు వదలడం ఆనవాయితీ.

కానీ మహారాష్ట్ర లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం బాబ్లీ గేట్ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. 13,993 క్యూసెక్కు ల నీరు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రంకు శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లో 17.879 టీఎంసీ ల నీరు నిల్వ ఉంది. బాబ్లీ ఎగువన విష్ణు పూరి ప్రాజెక్ట్ నిండి ఎప్పుడైనా అప్రాజెక్ట్ గేట్ల ను ఎత్తి దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.

Next Story