మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా

84
Maharashtra Minister Sanjay Rathod

ముంబయి: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ నుంచి తొలిసారిగా ఒక మంత్రి రాజీనామా చేశారు. టిక్ టాక్ స్టార్, బీడ్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల మహిళ మరణంతో సంబంధమున్నదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ ఆదివారం రాజీనామా లేఖను సీఎం ఠాక్రేకు అందించారు. ‘మా కమ్యూనిటీకి చెందిన ఓ మహిళ మరణంపై ప్రతిపక్షాలు మకిలి రాజకీయాలు చేస్తున్నాయి. సోషల్ మీడియా, మీడియాలో నన్ను, నా కమ్యూనిటీని అవమానపరిచాయి. నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికే కుట్రలు చేస్తున్నాయి. ఈ కేసులో నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగి నిజానిజాలు బయటికి రావాలని కోరుకుంటున్నాను. అందుకే మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నాను. సీఎంకు నా రాజీనామ పత్రాన్ని అందజేశాను’ అని రాథోడ్ వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..