- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ లాక్‌డౌన్.. స్కూల్స్, కాలేజీలు బంద్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించగా.. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నగరాల్లో ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇండోర్, భోపాల్, జబల్పూర్ లో ప్రతి ఆదివారం లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తెలిపింది. మూడు నగరాల్లో మార్చి 31 వరకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించగా.. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధాన నగరాల్లో ఆదివారం లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇండోర్, భోపాల్, జబల్పూర్ లో ప్రతి ఆదివారం లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తెలిపింది. మూడు నగరాల్లో మార్చి 31 వరకు స్కూల్స్, కాలేజీలను మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామని వెల్లడించింది.
Next Story






