మిషన్ భగీరథ వాటర్‌లో ‘మాంసం, ఎముకలు’.. భయంతో వణుకుతున్న ప్రజలు

by  |
మిషన్ భగీరథ వాటర్‌లో ‘మాంసం, ఎముకలు’.. భయంతో వణుకుతున్న ప్రజలు
X

దిశ, మహమ్మదాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా ఇంటింటికీ సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిలో మాంసపు ముక్కలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మహమ్మదాబాద్ మండల పరిధిలోని గదిర్యాల్ గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. గత మూడు రోజుల నుంచి మిషన్ భగీరథలో మురికి నీరు రావడంతో ఈరోజు గ్రామస్తులు నల్లా పైపుకు క్లాత్ చుట్టి నీటిని వడపోయగా అందులో ఎముకలు, చిన్నపాటి మాంసం ముక్కలు వచ్చాయి.

దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నీటిలో ఎముకలు రావడాన్ని గుర్తించడంతో గ్రామస్తులు మిషన్ భగీరథ నీళ్లు తాగాలంటేనే భయపడుతున్నారు. మొన్నటివారు ఈ నీటినే ఎక్కువగా తాగామని, ఇప్పుడు ఈ నీటిలో మాంసపు ముక్కలు రావడంతో తాగేందుకు వెనుకాముందు ఆడుతున్నారు.ఈ నీటిని తాగితే ఎక్కడ అనారోగ్యం బారిన పడుతామో అని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి మిషన్ భగీరథ నీరు స్వచ్ఛంగా సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed