జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్ 

by  |
జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్ 
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేఎల్ఐ పంపు హౌస్‎ను సందర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల అరెస్టును నిరసిస్తూ.. బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లా బంద్‎కు జిల్లా కాంగ్రెస్ పిలుపునిచ్చింది. మహబూబ్‎నగర్, గద్వాల్, నాగర్‎కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల బస్ డిపోల ముందు కాంగ్రెస్ నేతలు బైటాయించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. అదే సమయంలో పలువురు ముఖ్య నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. కేఎల్ఐలో పెద్ద సమస్య లేనప్పుడు అక్కడికి ప్రతిపక్షాలను వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎప్పుడూ కాంట్రాక్టర్లకు లాభం చేయడం, కమిషన్లను దండుకోవడమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు.


Next Story

Most Viewed