‘బెంగాల్ ముఖ్యమంత్రికి రామాయణం వినిపిస్తా’

46

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ రామేశ్వర శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీకి రామాయణ పుస్తకాన్ని ఇస్తానని రామేశ్వర శర్మ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ముందు జాగ్రత్తగా రామాయణం చదవాలని సూచించారు. ఇతర దేశం నుంచి వచ్చిన వారి ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని ఆమె జై శ్రీరామ్ నినాదాన్ని వ్యతిరేకిస్తున్నారని అయన అన్నారు. రాముడ్ని వ్యతిరేకించినవారి పరిస్థితి ఏమిటో ఒకసారి గతం చూసుకోవాలని అన్నారు. రాముడ్ని వ్యతిరేకిస్తే.. అందరికీ రావణుడి పరిస్థితే వస్తుందని అని వ్యాఖ్యానించారు. తాను ప్రొటెం స్పీకర్ అయినా ఎలాంటి సంకోచం లేకుండా జై శ్రీరామ్ అని నినదిస్తా అని రామేశ్వర శర్మ అన్నారు. అంతేగాకుండా మమత నివాసంలో 20 రోజులపాటు కూర్చుని రామాయణ ప్రవచనాలు వినిపిస్తానని అన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..