విషాదం.. కరోనాతో కాంగ్రెస్ నేత కన్నుమూత

by Shamantha N |   (  Updated:2021-04-11 03:52:40  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనాతో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కన్ను మూశారు. తాజాగా కరోనా బారినపడి కాంగ్రెస్‌ అభ్యర్థి మాధవరావు మృతి చెందారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం నుండి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలోనే ఆయన కరోనా బారినపడ్డారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మధురైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పరిస్థితి విషమించి మాధవరావు తుదిశ్వాస విడిచారు. [&hellip;]</p>

విషాదం.. కరోనాతో కాంగ్రెస్ నేత కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనాతో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కన్ను మూశారు. తాజాగా కరోనా బారినపడి కాంగ్రెస్‌ అభ్యర్థి మాధవరావు మృతి చెందారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీవిల్లిపుత్తూరు నియోజకవర్గం నుండి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలోనే ఆయన కరోనా బారినపడ్డారు.

పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మధురైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పరిస్థితి విషమించి మాధవరావు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై ఏఐసీసీ కార్యదర్శి సంజయ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

Next Story