పవన్‌కి షాక్.. జనసేన ముఖ్యనేత రాజీనామా

by Vadlamudi Anukaran |   (  Updated:2021-04-11 20:52:24  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్‌కు ఆయన ఘాటు లేఖ రాశారు. పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని, తాను పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఓటర్లకు పవన్ అండగా నిలవలేదని గంగాధరం పేర్కొన్నారు. రాజకీయాలు, సినిమా వేరు వేరని, వాటి మధ్య తేడా తెలియని వారితో తాను కలిసి [&hellip;]</p>

పవన్‌కి షాక్.. జనసేన ముఖ్యనేత రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం షాకిచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్‌కు ఆయన ఘాటు లేఖ రాశారు. పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని, తాను పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఓటర్లకు పవన్ అండగా నిలవలేదని గంగాధరం పేర్కొన్నారు.

రాజకీయాలు, సినిమా వేరు వేరని, వాటి మధ్య తేడా తెలియని వారితో తాను కలిసి పనిచేయలేనన్నారు. పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా.. ఖండించడం లేదన్నారు. దీని వల్ల నిజాన్ని అంగీకరించినట్లుగా ప్రజలు భావిస్తున్నారని గంగాధరం చెప్పారు.

ప్రజలు ఆశించినట్లుగా జనసేన పనిచేయడం లేదన్నారు. జనసేన పార్టీలో ముఖ్యనేతగా గంగాధరంకు పేరుంది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్‌గా, ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా జనసేనలో పనిచేశారు.

Next Story