విశాఖపట్నంలో గల్లీరౌడీ ఫీట్లు..

by  |
విశాఖపట్నంలో గల్లీరౌడీ ఫీట్లు..
X

దిశ, సినిమా : సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా కామెడీ చిత్రాల దర్శకుడు శివనాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. కోలీవుడ్ స్టార్ యాక్టర్ బాబా సింహా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, వైవా హర్ష లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. కాగా సాయి కార్తిక్, రామ్ మిర్యాల సంగీతం అందించిన సినిమా నుంచి తాజాగా లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. భాస్కరభట్ల రాసిన ‘విశాఖపట్నంలో రౌడీగాడో’ అనే పాటను టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లాంచ్ చేశారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ బ్యానర్స్‌పై కేవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సాంగ్ విషయానికొస్తే.. యాసిన్ నిజార్ ఆలపించిన పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.



Next Story

Most Viewed