ప్రేమ జంట ఆత్మహత్య.. నెలరోజుల తర్వాత వెలుగులోకి

by Shyam |

<p>దిశ, రంగారెడ్డి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్నారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోవడంతో ఆత్మహత్య చేసుకుని నెలరోజులు అవుతుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతం కావడం, జనసంచారం లేకపోవడంతో ఇన్నిరోజులు ఎవరూ గుర్తించలేకపోయారు. శనివారం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సమీపంలోని ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతులను గుర్తించాల్సి ఉంది. [&hellip;]</p>

ప్రేమ జంట ఆత్మహత్య.. నెలరోజుల తర్వాత వెలుగులోకి
X

దిశ, రంగారెడ్డి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్నారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోవడంతో ఆత్మహత్య చేసుకుని నెలరోజులు అవుతుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతం కావడం, జనసంచారం లేకపోవడంతో ఇన్నిరోజులు ఎవరూ గుర్తించలేకపోయారు. శనివారం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సమీపంలోని ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతులను గుర్తించాల్సి ఉంది.

Tags: lovers suicide, Ananthagiri forest, vikarabad

Next Story