- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమజంట నిన్న మిస్సింగ్.. నేడు నిర్జీవంగా..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమికులు చేసిన పనికి రెండు కుటుంబాలు విషాదంలో మునిగాయి. కారణాలు ఏమైనా రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. లవర్స్ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మోపిదేవి మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పేరుబోయిన సాయి (22), అదే గ్రామానికి చెందిన బాలిక (14) ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కాగా, శనివారం ఉదయం ప్రేమికులు ఇద్దరు వేర్వేరుగా […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమికులు చేసిన పనికి రెండు కుటుంబాలు విషాదంలో మునిగాయి. కారణాలు ఏమైనా రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. లవర్స్ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మోపిదేవి మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన పేరుబోయిన సాయి (22), అదే గ్రామానికి చెందిన బాలిక (14) ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.
కాగా, శనివారం ఉదయం ప్రేమికులు ఇద్దరు వేర్వేరుగా బయటకు వెళ్లిపోయారు. ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు సాయంత్రం అయినా రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామం సమీపంలో యువతీయువకుడు ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం అందింది. వెంటనే ఇరు కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. ప్రేమికులు ఇద్దరు చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతూ కలిపించారు. ఇరువురి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చల్లపల్లి ఎస్సై నాగరాజు కేసు నమోదు చేశారు.






