పెళ్లికి అంగీకరించలేదని ప్రేమజంట ఆత్మహత్య

115
Lovers Suicidu

దిశ, వెబ్‌డెస్క్ : మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించరనే నెపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాధ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం..

కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన సాయి (22), ఫాతిమా (15) రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. సాయి ఐటీఐ చేస్తుండగా.. ఫాతిమ 8వ, తరగతి పూర్తి చేసింది. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సాయి కుటుంబ సభ్యులకు తన ప్రేమ విషయం చెప్పగా వారు అంగీకరించలేదు. దీంతో గురువారం రాత్రి ప్రేమికులు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినప్పటికీ సమాచారం తెలియలేదు. కాగా శుక్రవారం ఉదయం కోదాడ పట్టణం సమీపంలో పెద్ద చెరువులో తేలియాడుతున్న రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వాటిని పరిశీలించగా.. సాయి, ఫాతిమావిగా తేలింది. స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..