Naga Chaitanya : నాగ చైతన్య 'లవ్ స్టోరీ' గుట్టు .. ఆ స్టేజిపై నాగ్ విప్పనున్నాడా..?

by  |
Naga Chaitanya : నాగ చైతన్య లవ్ స్టోరీ గుట్టు .. ఆ స్టేజిపై నాగ్ విప్పనున్నాడా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. కరోనా అడ్డంకులన్నింటిని దాటుకొని ఈ నెల 24 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఇటీవలే మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయగా, ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రమోషన్లో భాగంగా ‘లవ్ స్టోరీ’ జంట.. బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనుందని తెలుస్తోంది.

థియేటర్లలో సినిమాలు విడుదలైయ్యేటప్పడు ప్రమోషన్లలో భాగంగా బిగ్ బాస్ హౌజ్ లో సినీ స్టార్స్ హంగామా చేసిన విషయం విదితమే. ఇక తాజాగా ‘లవ్ స్టోరీ’ జంట ఈ వారం బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనుంది. ఈ వీకెండ్ ఎపిసోడ్‌లో ఆన్ స్క్రీన్ జోడీ నాగ చైతన్య- సాయి పల్లవి సందడి చెయ్యబోతున్నారు.ఇక ఎలాగూ హోస్ట్ నాగార్జునే కాబట్టి.. తండ్రికొడుకులిద్దరు స్టేజ్ పై రచ్చ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం సామ్- చై విడాకుల వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ప్రమోషన్లోనైనా చైతు నోరు తెరుస్తాడా..? నాగ్ అయినా హింట్ ఇస్తాడా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు సామ్ కూడా ఈ బిగ్ బాస్ స్టేజ్ పై హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

సమంతతో డైవోర్స్.. ఎట్టకేలకు నోరు విప్పనున్న నాగ చైతన్య..?


Next Story

Most Viewed