సమంతతో డైవోర్స్.. ఎట్టకేలకు నోరు విప్పనున్న నాగ చైతన్య..?

12278

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సమంత- చైతన్యల విడాకులే హాట్ టాపిక్ గా మారాయి. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతున్నారనే వార్త సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ఫ్యామిలీ కోర్ట్ లో కేసు నడుస్తోంది అని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతోన్న అక్కినేని ఫ్యామిలీ నోరుమెదపకపోవడం ఆశ్చర్యం. ఇక ఈ విషయమై క్లారిటీ తీసుకోవాలని మీడియా చూపంతా అక్కినేని ఫ్యామిలీ మీదే ఉందంటే అతిశయోక్తి కాదు. తమ విడాకుల గురించి, రూమర్స్ గురించి సామ్ ని అడిగినప్పుడల్లా చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తా అంటూ మాట దాటేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితులలో నాగ చైతన్య ఈ విషయమై నోరు విప్పక తప్పేలా లేదు.

ప్రస్తుతం మీడియాను తప్పించుకు తిరుగుతున్న నాగ చైతన్య ఎట్టకేలకు మీడియా ముందుకు రానున్నాడు. ఆయన నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 24 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కోసమైనా చై మీడియా ముందుకు రావాలి. ఇక దీంతో  చైతూ ఎప్పుడెప్పుడు మీడియా ముందుకు వస్తాడా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆయనను కలిసిన ప్రతి ఒక్కరు అడిగే మొదటి ప్రశ్న సమంతతో విడిపోతున్న వార్తలు నిజమేనా అని.. ఇక వీటితో పాటు సామ్ పేరు మార్పు గురించి ఖచ్చితంగా అడుగుతారు.

అంతే కాకుండా ఎందుకు ఈ మధ్య  కాలంలో సమంత మీరు కలిసి కనిపించడం లేదు అంటూ సోషల్ మీడియాలో అంటున్నారు.. దీనికి మీ సమాధానం ఏంటీ అంటూ ప్రశ్నించే అవకాశం ఉంది. మరి ఈ ప్రశ్నలకు చైతూ ఏం సమాధానం చెప్తాడా చూడాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ఎన్నో వాయిదాలను దాటుకొని ఎట్టకేలకు ఈ నెల 24 న విడుదల కానుంది. ఇక ఈ వారంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండబోతోంది. మరి ఈ వేడుకలకు భార్య సమంత అటెండ్ కానుందా..? అనేది కూడా మిస్టరీనే. మరి చూద్దాం అక్కినేని వారబ్బాయి మీడియా ప్రశ్నలకు తలొగ్గుతాడా..? లేదా సామ్ లానే దాటేస్తాడా..? అని.

కౌన్సిలింగ్ స్టేజ్ లో సమంత- చైతన్య డైవోర్స్.. బ్రేకప్ స్టోరీ వైరల్

కోర్టులో సమంత- చైతన్య డైవోర్స్ కేసు.. వెడ్డింగ్ రింగ్ తో ప్రత్యక్షమైన అక్కినేని కోడలు

 

https://www.facebook.com/Dishacinema

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..