రానాతో ‘లవ్ స్టోరి’ ముచ్చట్లు పంచుకున్న నాగచైతన్య

by  |
రానాతో ‘లవ్ స్టోరి’ ముచ్చట్లు పంచుకున్న నాగచైతన్య
X

దిశ, సినిమా : ‘ఫిదా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న చిత్రం ‘లవ్ స్టోరి’. ఇందులో కూడా ‘ఫిదా’ హీరోయిన్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ‘సారంగదరియా’ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవగా.. మిగతా పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 16న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. ఈ క్రమంలో రానా దగ్గుబాటి హోస్టింగ్‌లో నడుస్తున్న ‘నెం.1 యారి’ షోకు నాగచైతన్య, సాయిపల్లవితో పాటు డైరెక్టర్ శేఖర్ కమ్ముల హాజరై ‘లవ్ స్టోరి’ విశేషాలు వెల్లడించారు. ఇక సాయిపల్లవి ‘విరాటపర్వం’ సినిమాలో ‘వెన్నెల’ పాత్రలో రానాకు జోడీగా నటించడం విశేషం. కాగా ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్ కానుంది.


Next Story

Most Viewed