- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శారీరకంగా కలిశారని బతికుండగానే నిప్పంటించారు
<p>ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ జంట శారీరకంగా కలవడం చూసి బ్రతికుండగానే నిప్పంటించి చంపేయాలని చూసారు. యువకుడు అక్కడికక్కడే మరణించగా అతని ప్రియురాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడి మరణించింది. వివరాల్లోకి వెళితే బుధవారం ఉత్తర్ ప్రదేశ్ లోని బందా జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. యువతి కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రేమికుల జంట శారీరకంగా కలిసి ఉండటాన్ని చూసి యువతి కుటుంబసభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిద్దరిని ఒక గుడిసెలో […]</p>

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ జంట శారీరకంగా కలవడం చూసి బ్రతికుండగానే నిప్పంటించి చంపేయాలని చూసారు. యువకుడు అక్కడికక్కడే మరణించగా అతని ప్రియురాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడి మరణించింది. వివరాల్లోకి వెళితే బుధవారం ఉత్తర్ ప్రదేశ్ లోని బందా జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. యువతి కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఈ ప్రేమికుల జంట శారీరకంగా కలిసి ఉండటాన్ని చూసి యువతి కుటుంబసభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిద్దరిని ఒక గుడిసెలో బంధించి గుడిసెకు తాళం వేశారు. తర్వాత ఆ గుడిసెకు నిప్పంటించి సజీవంగా దహనం చేసేందుకు ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే యువకుడు బోలా మరణించాడు. ప్రియాంక అనే అమ్మాయికి 80 శాతం ఒళ్ళంతా కాలిపోయింది.
దీంతో స్థానిక వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం కాన్పూర్ లోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. కాన్పూర్ కి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేసారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేసినట్టు సమాచారం.






