- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. రన్నింగ్‌లో విడిపోయిన లారీ బాడీ..
by Sridhar Babu |
<p>దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. లారీ బాడీ ఛాసిస్ విడిపోయి రోడ్డుపై పడింది. వివరాల ప్రకారం.. కర్నూలు నుంచి వడ్ల లారీ సుల్తానాబాద్‌కు వెళ్తున్నది. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం అల్గునూర్ చౌరస్తా వద్దకు చేరుకున్న లారీ బాడీ, ఛాసిస్ వేరు కావడంతో లారీ కొద్ది భాగం రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. […]</p>

X
దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. లారీ బాడీ ఛాసిస్ విడిపోయి రోడ్డుపై పడింది. వివరాల ప్రకారం.. కర్నూలు నుంచి వడ్ల లారీ సుల్తానాబాద్‌కు వెళ్తున్నది. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం అల్గునూర్ చౌరస్తా వద్దకు చేరుకున్న లారీ బాడీ, ఛాసిస్ వేరు కావడంతో లారీ కొద్ది భాగం రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రహదారిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లారీనీ క్రేన్ సాయంతో రోడ్డుపై నుండి తొలగించి.. ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Next Story






