Riots in AP: రాష్ట్రంలో మారణహోమం.. ఏపీ మరో బీహార్‌గా మారనుందా..?

by Indraja |   (  Updated:2024-05-15 08:52:32  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కొన్ని ప్రాంతాల్లో రాజుకున్న హింసాత్మక జ్వాలలు నేటికీ ఎగసిపడుతూనే ఉన్నాయి.

Riots in AP: రాష్ట్రంలో మారణహోమం.. ఏపీ మరో బీహార్‌గా మారనుందా..?
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కొన్ని ప్రాంతాల్లో రాజుకున్న హింసాత్మక జ్వాలలు నేటికీ ఎగసిపడుతూనే ఉన్నాయి. రాజకీయ నేతల స్వార్థానికి అమాయక ప్రజలు బలైపోతున్నారు. ముఖ్యంగా అనంతపురం, గుంటూరు, అన్నమయ్య జిల్లాల్లో ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను వైసీపీ నేతలు కురుక్షేత్రంగా మార్చారు. ఎన్నికల కోడ్‌ నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై, కార్యకర్తలపై దాదులకు పాల్పడ్డారని, టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారనే వార్తలు వెలుగు చూశాయి.

వైసీపీ అభ్యర్థి ఓటరుపై దాడికి పాల్పడం, అలానే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు, టీడీపీ నేత అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, ఆ ఘర్షణను నిలువరించేందుకు టీడీపీ నేత అక్కడ నుండి వెళ్ళినా, కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం అక్కడే ఉండి అనుచరులను రెచ్చగొట్టారని, ఈ ఘర్షణలో పెద్దారెడ్డి కారు అద్ధాలతోపాటు పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఎన్నికలు ముగిసినా నేటికీ పల్నాడు జిల్లా మాచర్లలో మారణహోమం రగులుతూనే ఉంది. దీనితో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావటం లేదు. షాపులన్నీ మూతబడ్డాయి. ప్రస్తుతం 2300 మంది పోలీసులు,కేంద్ర బలగాలు మోహరించి కాపలా కాస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి లు గృహ నిర్భంధంలో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే, ఏపీ మరో బీహార్‌గా మారనుందా? అనే అనుమానం కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story