పెరుగుతోన్న స్థానాలు.. తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం ఎన్ని సీట్ల లీడ్‌లో ఉందంటే?

by Gantepaka Srikanth |

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు అదరగొడుతున్నారు.

పెరుగుతోన్న స్థానాలు.. తెలంగాణలో కాంగ్రెస్ మొత్తం ఎన్ని సీట్ల లీడ్‌లో ఉందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు అదరగొడుతున్నారు. తొలుత మూడు, నాలుగు సీట్లలో ఆధిక్యం కనబరిచిన ఆ పార్టీ అభ్యర్థులు ప్రస్తుతం ఏకంగా.. 8 స్థానాలకు పెరిగారు. 7 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. ఒక స్థానంలో బీఆర్ఎస్, మరో స్థానంలో ఎమ్ఐఎం లీడ్‌లో ఉన్నాయి. మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తుండగా.. నల్లగొండ, ఖమ్మం, భువనగిరి, జహీరాబాద్, పెద్దపెల్లి, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూలులో కాంగ్రెస్‌లో లీడ్‌లో ఉంది. హైదరాబాద్‌లో ఎమ్ఐఎమ్ అభ్యర్థి అసదుద్దీన్, మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

Next Story