లోకేష్ పర్యటనలో అపశృతి.. కారు బోల్తా

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-11-10 03:28:05  IST  )

<p>దిశ, రాయలసీమ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. లోకేశ్ పర్యటనలో పాల్గొనేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్&#x200d;లో బయలుదేరారు. అయితే గుత్తి హైవే నుంచి అనంతపురం వెళ్లే దారిలో కాసేపల్లె టోల్‌గేట్ ప్లాజా ముందు బృందావన్ హోటల్ దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్‌లోని ఓ వెహికల్ అదుపుతప్పి రోడ్డు పక్కన సిమెంట్ దిమ్మను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. యాదవ [&hellip;]</p>

R-Accident-1
X

దిశ, రాయలసీమ: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. లోకేశ్ పర్యటనలో పాల్గొనేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్‍లో బయలుదేరారు. అయితే గుత్తి హైవే నుంచి అనంతపురం వెళ్లే దారిలో కాసేపల్లె టోల్‌గేట్ ప్లాజా ముందు బృందావన్ హోటల్ దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్‌లోని ఓ వెహికల్ అదుపుతప్పి రోడ్డు పక్కన సిమెంట్ దిమ్మను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. యాదవ సంఘం అధ్యక్షుడు ఇగుడురు ఆది తీవ్ర గాయాలపాలవ్వగా అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Next Story