చంద్రబాబుపై ఏపీ హైకోర్టులో పిటిషన్

by  |
చంద్రబాబుపై ఏపీ హైకోర్టులో పిటిషన్
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై లాక్ డౌన్ ఉల్లంఘన అభియోగం నమోదైంది. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిన చంద్రబాబు అడుగడుగునా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లాక్‌డౌన్ ఆంక్షల ఉల్లంఘన కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు.

టీడీపీ అధినేత సుమారు రెండు నెలల తర్వాత సోమవారం హైదరాబాద్ వీడి విజయవాడ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అడుగడుగునా లాక్‌డౌన్ ఆంక్షలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వంగా వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిసనర్ తరపున వాదనలు వినిపించిన అడ్వటేక్ పోనక జనార్ధన్ రెడ్డి చంద్రబాబుపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య భారీ కాన్వాయ్‌తో ప్రయాణం చేసిన చంద్రబాబు.. పలుచోట్ల జనసమీకరణ, బైక్ ర్యాలీలతో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్నది ప్రధాన ఆరోపణ. రాజకీయ ర్యాలీలపై కేంద్రం నిషేధం విధించిన అంశాన్ని గుర్తు చేసిన పిటిషనర్.. కరోనా విస్తరించేలా బాబు వ్యవహరించాడని పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.



Next Story

Most Viewed