- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో ఆంక్షలు కఠినం!
<p>దిశ, గుంటూరు: కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుండటంతో గుంటూరు జిల్లాలో పోలీసులు లాక్‌డౌన్‌ను ఇంకాస్త కఠినతరం చేశారు. ఆదివారం నరసారావుపేటలో ఓ వైద్యుడికి కరోనా సోకడంతో ఆసుపత్రి సిబ్బందితో పాటు వందమందికి పైగా ఔట్ పేషెంట్లను క్వారంటైన్‌కు తరలించారు. హాట్‌స్పాట్‌లుగా ఉన్న గుంటూరు, నరసరావు పేటలో ప్రజలెవరూ బయటకు రావొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరైనా అలక్ష్యంగా బయటకు వస్తే క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక, గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. […]</p>

దిశ, గుంటూరు: కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతుండటంతో గుంటూరు జిల్లాలో పోలీసులు లాక్‌డౌన్‌ను ఇంకాస్త కఠినతరం చేశారు. ఆదివారం నరసారావుపేటలో ఓ వైద్యుడికి కరోనా సోకడంతో ఆసుపత్రి సిబ్బందితో పాటు వందమందికి పైగా ఔట్ పేషెంట్లను క్వారంటైన్‌కు తరలించారు. హాట్‌స్పాట్‌లుగా ఉన్న గుంటూరు, నరసరావు పేటలో ప్రజలెవరూ బయటకు రావొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరైనా అలక్ష్యంగా బయటకు వస్తే క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక, గుంటూరులో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా మరో 23 కేసులు నమోదైనట్లు వైద్య శాఖ ప్రకటించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం 237 కొవిడ్-19 కేసులు అయ్యాయి. వీటిలో ఎక్కువగా గుంటూరు నగరంలోనే ఏకంగా 134 కేసులు ఉండగా, నరసరావుపేటలో 64 కేసులున్నట్టు అధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 29 మంది కరోనా నుంచి డిస్చార్జి అవగా, ఎనిమిది మంది మరణించారు.
Tags:guntur, coronavirus, covid-19, lockdown strict






