- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోసిపోతున్న చేపల మార్కెట్లు
<p>దిశ, హైదరాబాద్: కరోనా ఎఫెక్టుతో అన్నిరంగాలు కుదేలయ్యాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో నిత్యావసర వస్తువులు మినహా వ్యాపార సంస్థలన్నీ మూతపడటంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడ్డ సామాన్యకూలీల బతుకు బండి నిలిచిపోయింది. ఈ క్రమంలోనే వేలాది మంది ఆధారపడిన చేపల మార్కెట్లు మార్చి 22 నుంచి మూత పడటంతో కార్మికులు జీవన భృతి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ముషీరాబాద్ చేపల మార్కెట్ అతి పెద్దది. ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు, ఆకివీడు, ఏలూరు, భీమవరం, నర్సాపురం, కాకినాడ, చీరాల, […]</p>

దిశ, హైదరాబాద్: కరోనా ఎఫెక్టుతో అన్నిరంగాలు కుదేలయ్యాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో నిత్యావసర వస్తువులు మినహా వ్యాపార సంస్థలన్నీ మూతపడటంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడ్డ సామాన్యకూలీల బతుకు బండి నిలిచిపోయింది. ఈ క్రమంలోనే వేలాది మంది ఆధారపడిన చేపల మార్కెట్లు మార్చి 22 నుంచి మూత పడటంతో కార్మికులు జీవన భృతి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో ముషీరాబాద్ చేపల మార్కెట్ అతి పెద్దది. ఆంధ్రప్రదేశ్‌లోని కైకలూరు, ఆకివీడు, ఏలూరు, భీమవరం, నర్సాపురం, కాకినాడ, చీరాల, రేపల్లెతో పాటు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నల్లొండ ప్రాంతాల నుంచి రోజూ 40టన్నుల చేపలు ఇక్కడకు దిగుమతి అవుతాయి. సుమారు 100మంది వ్యాపారులు, మరో 80 మంది రిటైల్ వ్యాపారులు, వినియోగదారులు చేపలు కొనుగోలు చేసిన తర్వాత కటింగ్ చేసే 100 మంది కార్మికులు కలిపి దాదాపు 400 నుంచి 500 వరకూ చేపల మార్కెట్ పై ఆధారపడి జీవిస్తారు. ఇక ఆదివారం అయితే, చేపల కొనుగోలుకు వచ్చేవారు కిక్కిరిసిపోతారు.
పనుల్లేక పస్తులతో…
రోజూ చేపల అమ్మకాలు, కొనుగోళ్లతో కళకళ లాడే మార్కెట్.. ప్రస్తుతం చేపల విక్రయాలు లేక బోసిపోతుంది. ఈ మార్కెట్ పై ఆధారపడి జీవిస్తున్న వ్యాపారులు, కటింగ్ కార్మికులకు పనుల్లేకపోవడంతో ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా చేపలను కటింగ్ చేసేవారిలో అత్యధికంగా మహిళలే పనిచేస్తారు. మార్కెట్‌లో రోజువారీగా పనులు చేసుకుని బతికే వారికి ప్రస్తుతం పూట గడవడమే గగనంగా మారిందంటూ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ నుంచి చేపల మార్కెట్‌ను మినహాయించాలని పోలీసు అధికారులను కోరినట్టు ఆయన చెప్పారు.
Tags : Hyderabad Musheerabad Fish Market, Corona Effect, Lockdown, Market Association, Andhra Pradesh, Telangana






