- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళ ఆత్మహత్యాయత్నం.. ఎస్సైకి అభినందనలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, మానకొండూరు: స్థానికుల చాకచక్యంతో ఓ నిండు ప్రాణం దక్కింది. కుటుంబ కలహాల కారణంగా తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని కాకతీయ కాలువలో బుధవారం కరీంనగర్ పట్టణానికి చెందిన మహిళ దూకింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ మహిళను అటుగా వెళ్తున్న సుందరగిరి సతీష్, దుండ్ర. ఎల్లయ్యలు కాపాడారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా వెంటనే స్పందించిన ఎల్ఎండి ఎస్ఐ కృష్ణారెడ్డి, బ్లూ కోట్ హోంగార్డ్ లక్ష్మీనారాయణ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న ఆ […]</p>

X
దిశ, మానకొండూరు: స్థానికుల చాకచక్యంతో ఓ నిండు ప్రాణం దక్కింది. కుటుంబ కలహాల కారణంగా తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని కాకతీయ కాలువలో బుధవారం కరీంనగర్ పట్టణానికి చెందిన మహిళ దూకింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆ మహిళను అటుగా వెళ్తున్న సుందరగిరి సతీష్, దుండ్ర. ఎల్లయ్యలు కాపాడారు.
ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించగా వెంటనే స్పందించిన ఎల్ఎండి ఎస్ఐ కృష్ణారెడ్డి, బ్లూ కోట్ హోంగార్డ్ లక్ష్మీనారాయణ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను పోలీస్ వాహనంలో కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఎలాగైనా యువతి ప్రాణాలు కాపాడాలని ఆలోచనతో సొంతంగా వాహనాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిన ఎస్సైని పలువురు అభినందించారు. ఆ మహిళను కాపాడిన సుందరగిరి సతీష్, దుండ్ర ఎల్లయ్యలను ఎస్సై కృష్ణారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Next Story






