పోలింగ్ రోజు లోకల్ హాలీ డే

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-20 10:19:47  IST  )

<p>దిశ,సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గంలో నవంబర్ 3న పోలింగ్ నేపథ్యంలో ఆ రోజును సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 1564ను సోమవారం విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాలు, కార్యాలయాలకు పోలింగ్‌కు ముందు రోజు (నవంబర్ 2) తో పాటు పోలింగ్ రోజు (నవంబర్ 3)న స్థానిక సెలవు దినంగా ప్రకటించే అధికారాన్ని సిద్దిపేట [&hellip;]</p>

పోలింగ్ రోజు లోకల్ హాలీ డే
X

దిశ,సిద్దిపేట :
దుబ్బాక నియోజకవర్గంలో నవంబర్ 3న పోలింగ్ నేపథ్యంలో ఆ రోజును సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 1564ను సోమవారం విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలు, ఇతర భవనాలు, కార్యాలయాలకు పోలింగ్‌కు ముందు రోజు (నవంబర్ 2) తో పాటు పోలింగ్ రోజు (నవంబర్ 3)న స్థానిక సెలవు దినంగా ప్రకటించే అధికారాన్ని సిద్దిపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారికి ఇచ్చింది. అవసరమైతే ఓట్ల లెక్కింపు జరిగే నవంబర్ 10న కూడా లోకల్ హాలీడేగా ప్రకటించే అధికారాన్ని కూడా అప్పగించింది.

Next Story