- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెజవాడ టీడీపీలో చిచ్చు.. పార్టీ మారుతారా?
<p>విజయవాడ టీడీపీలో చిచ్చు రేగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఆ పార్టీలో విభేదాలకు కారణమైంది. విజయవాడ మున్సిపల్ స్థానానికి బరిలో తాను దిగుతానంటే తానే దిగుతానంటూ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు పోటీ పడడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి బొండా అనుచరుడు, మాజీ మేయర్ ఇద్దరూ నామినేషన్ దాఖలు చేయడం విశేషం. బోండా అనుచరుడ్ని మేయర్ వెనక్కి తగ్గమని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో […]</p>
విజయవాడ టీడీపీలో చిచ్చు రేగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఆ పార్టీలో విభేదాలకు కారణమైంది. విజయవాడ మున్సిపల్ స్థానానికి బరిలో తాను దిగుతానంటే తానే దిగుతానంటూ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు పోటీ పడడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి బొండా అనుచరుడు, మాజీ మేయర్ ఇద్దరూ నామినేషన్ దాఖలు చేయడం విశేషం.
బోండా అనుచరుడ్ని మేయర్ వెనక్కి తగ్గమని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరో ఒకరు వైఎస్సార్సీపీలోకి వెళ్లే అవకాశముందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో పార్టీ వర్గాలు రంగంలోకి దిగి ఇద్దరితో మంతనాలు జరుపుతున్నాయి. మరోవైపు ఈ ప్రాంతంలో క్షత్రియుల ప్రాబల్యం ఎక్కువగా ఉందని, క్షత్రియులకు ఒక్క సీటు కూడా కేటాయించని నేపథ్యంలో తమకు కేటాయించాలని ఆ సామాజిక వర్గం డిమాండ్ చేస్తోంది.
Tags: local body elections, vijayawada, municipal election, mayor seat, ex mayor, bonda followers






