ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా?.. రూ. 10 లక్షలు మీ సొంతమైనట్టే

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-23 23:59:11  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి ప్రభుత్వ పథకాల గురించి తెలియదు. దీంతో వారు ఆర్థికపరమైన సమస్యలతో తనవు చాలిస్తున్నారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి.. ఎవరైనా అప్పు ఇస్తే బాగుండూ, ఎదైనా లోన్ వస్తే బాగుండూ అని ఎదురు చూసేవారికి ఇది తీపి కబురు. సులభంగా లోన్ తీసుకోవాలంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అర్హత కలిగి ఉంటే సరిపోతుంది. దీని ద్వారా లోన్ తీసుకోవచ్చు. ఇది బ్యాంక్ డిజిటల్ లెండింగ్, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ లోన్‌ [&hellip;]</p>

ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా?.. రూ. 10 లక్షలు మీ సొంతమైనట్టే
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి ప్రభుత్వ పథకాల గురించి తెలియదు. దీంతో వారు ఆర్థికపరమైన సమస్యలతో తనవు చాలిస్తున్నారు. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి.. ఎవరైనా అప్పు ఇస్తే బాగుండూ, ఎదైనా లోన్ వస్తే బాగుండూ అని ఎదురు చూసేవారికి ఇది తీపి కబురు. సులభంగా లోన్ తీసుకోవాలంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అర్హత కలిగి ఉంటే సరిపోతుంది. దీని ద్వారా లోన్ తీసుకోవచ్చు.

ఇది బ్యాంక్ డిజిటల్ లెండింగ్, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ లోన్‌ ట్యాప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వలన సులభంగా లోన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా ఒక వ్యక్తి లక్షరూపాయిల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. లోన్ కావాలి అనుకునేవారు లోన్ ట్యాప్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ, ఈలోన్ ద్వారా నగదు తీసుకున్నవారు, తిరిగి 48 నెలల్లో తిరిగి చెల్లించాలి. ప్రస్తుతం ఈ లోన్ ట్యాప్‌కు 32 వేల మంది కస్టమర్లు ఉన్నారు. ఇక మరెందుకు ఆలస్యం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్‌‌లో అర్హత తీసుకోండి.. 10 లక్షల వరకు రుణం పొందండి.

More Finance news

రూ. 55 పొదుపుతో నెలకు 3000 పింఛన్.Pradhan Mantri Shram Yogi Maandhan (PM-SYM)

Next Story