నెటిజన్లను ఆలోచింపజేస్తున్న కుర్రాడి వీడియో.. నెట్టింట వైరల్

91

దిశ, వెబ్ డెస్క్ : వేసవి వస్తుంది.. మన ఇంటి ముందు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షులు, ఇతర జంతువుల కోసం నీళ్లు, ఆహారం పెట్టండి అంటూ వాట్సప్ స్టేటస్‌లు మనం చూసే ఉంటాం. అలాంటి స్టేటస్‌లు పెట్టిన వాళ్లు ఎంత మంది ఆ పని చేసి ఉంటారో తెలియదు కానీ, ఈ వీడియోలో మాత్రం ఓ కుర్రాడు చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. శభాష్ అంటూ కితాబు ఇస్తున్నారు. జాలి, దయ అనే పదాలకు మారుపేరుగా నిలిచిన ఈ కుర్రాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.. వేసవిలో ఎండల కారణంగా ఓ పావురం ఎండ వేడి భరించలేక ఓ ఇంటి బాల్కనీపై అవస్థలు పడుతోంది. ఈ విషయాన్ని గమనించిన ఆ ఇంటికి చెందిన కుర్రాడు.. పావురాలనికి కాస్త ఉపశమనం కలిగించాలని అనుకున్నాడు. అయితే పక్షికి ఎలా సాయం చేయాలో తోచలేదు. దీంతో ఇంట్లోకి వెళ్లి ఒక గరిట తీసుకొచ్చి.. గ్రిల్స్‌లో నుంచి చేతులు బయటకి పెట్టి.. పక్షికి నీటిని అందించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేసి ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుర్రాడు చేసిన పనికి నెట్టిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..