- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
వీధి కేవలం ప్రయాణ మార్గం కాదు
అదొక నిర్ణయపు రూపం.
ఎవరు నడవాలి,
ఎవరు జాగ్రత్తగా ఉండాలి
అని ముందే నిర్ణయించిన నిర్మాణ వాక్యం.
రాళ్లు నిష్పక్షపాతంగా కనిపిస్తాయి,
కాని వాటి అమరికలోనే
అధికారపు తర్కం పనిచేస్తుంది.
వీధి వెడల్పు
స్వేచ్ఛకు కొలమానం అవుతుంది.
ఈ మార్గం ఎవరిది
అందరికీ సమాన హక్కా
లేదా కొందరికే
వీధి ఒక ఇంటి పొడుగు
మిగతావారికి
అది ఎప్పుడూ ఒక సరిహద్దేనా
వీధులు మాట్లాడవు,
కాని అవి వేరు చేస్తాయి.
ఇది ద్వేషం కాదు
రూపకల్పనలో దాగిన
నిశ్శబ్ద రాజకీయం.
తత్వం స్పష్టం
వివక్ష మనుషుల్లోనే కాదు,
మనుషులు సృష్టించిన స్థలాల్లోనూ ఉంటుంది.
న్యాయం అంటే
చట్టాలు మార్చడం మాత్రమే కాదు
మన నిర్మాణాల ఆలోచననే
మళ్లీ ప్రశ్నించడం.
డాక్టర్ నూకరాజు బెందుకుర్తి
అసిస్టెంట్ ప్రొఫెసర్
సెంట్రల్ యూనివర్సిటీ అఫ్ కాశ్మీర్
94934 76437
Next Story






