యాపల పరిమళాలు యాడబోయే..!!

by Mallepaka Hamsa |   (  Updated:2023-02-26 05:05:53  IST  )

మాఘ మాసం.. ఆకు రాలి.. చెట్లు.. చిగురించే ..కాలం..

యాపల పరిమళాలు యాడబోయే..!!
X

మాఘ మాసం..

ఆకు రాలి..

చెట్లు.. చిగురించే ..కాలం..

లేలేత ఆకుల.. పచ్చధనపు..

పరిమళం వెదజల్లే సమయం..

గుబురు ఆకులు..

గుమ్మటపు కొమ్మలు..

ఎత్తైన రెమ్మలు..

వత్తైన నీడలు..

కొత్తైన చిగురులు..

పూచే.. పూతల వాసనలు..

వచ్చే పచ్చని ఆకుల పరిమళాలు..

వెదజల్లే ఆహ్లాదపు యాపల అందాలు..

గతంలో..

ఫిబ్రవరి ఆఖరలో..

మార్చి ఆరంభంలో..

అద్భుతంగా కన్పించే..

వేప చెట్ల రూపు ఇది..!

ఈ యేడు చూస్తే..

యాడ ..

యాపల అందాలు లేవు .!

ఛీడ పట్టి..

మంగు పట్టి..

వాడి పోయి ..

నీడపోయి..

ఆకు మారి..

రూపు మారి..

అందాల..

ఆ... వేప

సహజత్వం కోల్పోయి..

ఆహ్లదపు తీరుపోయి..

మోడు వారినట్టైయిపోయి..

కాలిన మొద్దోలే.. మారిపోయి..

కన్పిస్తుంటే..

వేప చెట్టు ను చూస్తే..

యద నిండా బాధ అయ్యింది..!

పాణం ఏదోలా తల్లడిల్లిపోయింది..!!

ఏదో రాయాలన్పించింది..

ఇలా..

అక్షరాలను ఆరబోయాల్సివచ్చింది..

ఎండిన యాపల చూస్తే..

యాడ బోయాయి..

వేపల అందాల పరిమళాలు..

అని ..

ఆవేదన మిగిలింది.!!

చేదు వేప ను చూస్తే..

తీపి జ్ఞాపకం గుర్తొచ్చింది..!!

కాయ కష్టం చేసిన పాణం..

కాసింత సేదతీరేందుకు..

కాళ్లమంచం ఏసుకొని..

కాసేపు అడ్డమొరిగితే..

కంటి నిండా నిద్దురొచ్చిన..

వేప చెట్ల కమ్మని నీడ.. యాదొచ్చింది..

ఆయుర్వేద..

ఔషధ గుణాలున్న ..

తల్లి యాప చేసిన మేలు..

మదికి తట్టింది..!!!!!

( ఈ ఏడాది..వేప చెట్లు ఎక్కడ చూసినా .. ఎక్కువ శాతం..ఎండి పోయి.. నల్లగా.. మాడి పోయి.. కన్పించటంతో.. ఇలా..కలం కదిలించాల్సి వచ్చింది. )

రచన: ఫోటో:

బొల్లెద్దు వెంకట్ రత్నం



(బి.వి ఆర్.)

సూర్యాపేట

సెల్: 9963616381

Next Story