Sahitya Akademi : ప్రసాద్ సూరి 'మైరావణ'కు కేంద్ర సాహిత్య యువ పురస్కారం

by Muthe.Rajitha |

కేంద్ర సాహిత్య అకాడమీ(Sahitya Akademi) బుధవారం బాల్యసాహిత్య యువ సాహిత్య పురస్కారాలు(Sahitya Akademi Awards 2025) ప్రకటించింది.

Sahitya Akademi : ప్రసాద్ సూరి మైరావణకు కేంద్ర సాహిత్య యువ పురస్కారం
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర సాహిత్య అకాడమీ(Sahitya Akademi) బుధవారం బాల్యసాహిత్య యువ సాహిత్య పురస్కారాలు(Sahitya Akademi Awards 2025) ప్రకటించింది. మొత్తం 24 భాషల్లో బెస్ట్ రచనలను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగులో ప్రసాద్ సూరి(Prasad Suri) రచించిన 'మైరావణ'(Miaravana) నవలను యువ సాహిత్య పురస్కారానికి ఎంపిక చేయగా.. గంగిశెట్టి శివకుమార్(Gangishetti Shivakumar) రచించిన 'కబుర్ల దేవత'(Kaburla Devata) పుస్తకానికి బాల సాహిత్య అవార్డు ప్రకటించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన సమావేశమైన ఎగ్జిక్యూటివ్ బోర్డు పురస్కారాలకు ఎంపికైన పుస్తకాలను ప్రకటించింది.

అయితే ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించిన యువ పురస్కారం ప్రకటించలేదు. 23 భాషల్లో పబ్లిష్ అయిన పుస్తకాలకు మాత్రమే ప్రకటించారు. ఈ విజేతలకు త్వరలో ఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. ఈ పురస్కారం కింద గ్రహితకు జ్ఞాపికతోపాటు, రూ.50 వేల నగదుతో సత్కరిస్తారు. తెలుగు సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైన ప్రసాద్ సూరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వార్త నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అన్నారు. తనను ప్రోత్సహించిన పెద్దలకు, సన్నిహితులకు, పబ్లిషర్స్ కి, జ్యూరీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story