కవిమాట: ఓటు వజ్రాయుధం

by Ravi |   (  Updated:2022-10-23 18:30:36  IST  )

poet word

కవిమాట: ఓటు వజ్రాయుధం
X

ఓటుహక్కు మన జన్మహక్కు

ఓటు ప్రజాస్వామ్య సౌధానికి పునాది

ఓటు ప్రగతి పాలనకు బాట

ఓటు వ్యవస్థ మార్పునకు సాధనం

ఓటు శాసననిర్మాతను సృష్టిస్తుంది

ఓటును అమ్మకు అభివృద్ధిని మరువకు

ఓటు విలువ తెలుసుకో

భవితను నిర్ణయించుకో

నోటుకు ఓటు ప్రగతికి చేటు

ఓటు రాజ్యాంగమిచ్చిన వరం

కారాదు మనీ మద్యం పరం

ఓటును అమ్ముకోకు ప్రగతిని నమ్ముకో

ఓటుతో నేరమయ రాజకీయాలకు

చరమగీతం పాడాలి

నీతి నిజాయితీ గల ప్రజాప్రతినిధిని ఎన్నుకో

అక్రమార్కులను అడ్డుకో

అభివృద్ధి కాముకులను ఎన్నుకో

ప్రలోభాలకు లొంగకు, ప్రగతిశీలురకు పట్టం కట్టు

సచ్ఛీలురను ఎన్నుకో

సత్వరాభివృదికి సారథిగ నిలువు

అక్రమాలను అరికట్టి

సామాజిక న్యాయం కోసం ఓటెయి

అభివృద్ధికర సమాజానికి ఓటు బాట కావాలి

అవినీతి అంతానికి ఓటే వజ్రాయుధం

నేదునూరి కనకయ్య

అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం

94402 45771

Next Story